పాఠశాల హాస్టల్, గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

హైదరాబాద్ ఫిబ్రవరి 26 ;పెరిగిన ధరల ప్రకారం రాష్టంలోని 8 లక్షల మంది SC/ST/BC హాస్టల్ మరియు గురుకుల పాఠశాల మరియు కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని అలాగే 16 లక్షల కాలేజీ విధ్యార్ధుల స్కాలర్ షిప్ లు పెంచాలని పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు/స్కాలర్ షిప్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్ధులు నేడు ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా జరిపారు. విధ్యార్ధులను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ 6 సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు స్కాలర్ షిప్ లు కొనసాగిస్తున్నారు. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు, నూనెలు, పప్పులు, కూరగాయలు అన్ని ఆహార వస్తువుల ధరలు రెండు రెట్లు -మూడు రెట్లు పెరిగాయి. ఇలా పెరగడంతో హాస్టల్ మరియు గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారు. ధరలు పెరుగడంతో హాస్టల్ “మెను” పాటించడానికి డబ్బులు సరిపోవడంలేదని గుడ్లు, పండ్లు తగ్గించారు. మరల హాస్టల్ విద్యార్థుల కష్టాలు ప్రారంభమయ్యాయి. హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దుర్మార్గం. సంబంధిత మంత్రులు, కమిషనర్లు ఒకనాడు కూడా హాస్టళ్ళను సందర్శించి విద్యార్థుల సాదక బాధకాలు తెలుసుకోవడం. లేదు. మనం పోరాడకపోతే మన హాస్టళ్ళ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్నారు.యర్ర సత్యనారాయణ, గుజ్జ సత్యం ,అంజి, నీల వెంకటేష్, వేముల రామ కృష్ణ, అనంతయ్య, రాజ్ కుమార్, తగుల్లా అనిల్, కట్ట హరీష్, రాందేవ్, నిఖిల్, చందన అన్నపూర్ణ, , ఉమాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking