కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని తెలంగాణా రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ గా నియాకమైన దరిమిల స్వామి వారిని దర్శించుకోవడం ఇది మూడవ సారి అని ఆయన తెలిపారు. తమ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, దేశంలోనే ఇలాంటి పథకాల అమలులో తెలంగాణా రాష్ట్రం రోల్ మోడల్ అని పేర్కొనారు. తన నేతృత్వంలోని రాష్ట్ర బిసి కమిషన్ ఈ వర్గాల వికాసం నేపధ్యంగా పలు అంశాలపై అధ్యయనం కొనసాగిస్తున్నదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు తిరుమలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రాతఃకాల వివిఐపి ప్రోటోకాల్ లో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం అనంతరం రంగనాయిక మండపంలో స్వామి వారి శేష వస్త్రంను అధికారులు కప్పారు. తీర్థ ప్రసాదాలను అర్చక స్వాములు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.