తూప్రాన్ మున్సిపాలిటీ లోబిఆర్ఎస్ పార్టీ నాయకుల సమన్వయ లోపం. బిఆర్ఎస్ పార్టీ లోఎవరికి వారు యమునా తీరం

 

తూప్రాన్, అక్టోబర్ 27

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ పరిధిలో బిఆర్ఎస్ నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారింది. గ్రూపు రాజకీయాలు ఆ పార్టీ క్యాడర్‌ను యువతను కలవర పెడుతున్నాయి.
ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు ఆ పార్టీలో యువతను అతలాకుతలం చేస్తున్నాయి.
ఇటువంటి పీక్ టైం లో కలిసికట్టుగా పని చేయాల్సిన అధికార పార్టీ నాయకుల్లో సమన్వయ లోపం కారణంగా పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా సీనియర్లు మరియు యువత రెండు వర్గాలుగా చీలిపోయింది.
పార్టీలో ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది.
ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలు జరుపుకోవడం చర్చకు దారి తీస్తోంది.

ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ముఖ్య కార్యకర్తలకు యువతకు విలువలు లేవని,
కొందరు నాయకులు పార్టీకి నష్టం చేస్తున్నారని,
వెంటనే అధిష్టానము గుర్తించాలి అని,
మున్సిపల్ నాయకులు కొందరు స్వార్త రాజకీయాలు చేస్తూ గ్రూప్ రాజకీయాలు చేస్తూ మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలగ చేస్తున్నారని గ్రూపు రాజకీయాలు మానుకొని కష్ట పడ్డ కార్యకర్తలను గుర్తించి సమన్వయం చేయాలనీ తూప్రాన్ మున్సిపల్ బిఆర్ఎస్ యువత కోరుతున్నారు.
ముఖ్యంగా యువతకు పార్టీ ఎలక్షన్ బాధ్యతలు అప్పగించాలని సీనియర్ లతో కలిపి సమన్వయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమం లో పలువురు యూత్ నాయకులు, మరి కొందరు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking