ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో లక్షెట్టిపేటకు చెందిన అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.పట్టణానికి చెందిన నల్ల చంద్రయ్య, సునీత దంపతుల కుమార్తె కావ్యశ్రీ ఇటీవల వెలువడిన టిఎస్పిఎస్సి పరీక్ష ఫలితాల్లో ఎలక్ట్రిక్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. స్థానిక గుడ్ షెఫర్డ్ స్కూల్లో పదవ తరగతి, కరీంనగర్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ సీటు వచ్చిందని కావ్య శ్రీ తెలిపారు.