ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.14 వ వార్డ్ తోపాటు నోములవాడలో శుక్రవారం మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు. దీంతో గణేష్ మండలపాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. మహిళలు భక్తి శ్రద్దలతో సామూహిక కుంకుమ పూజ చేశారు.నోముల వాడలో 56 ప్రసాదాలతో గణేశునికి మహా నైవేద్యాo సమర్పించారు.14 వ వార్డ్ లోని గణేష్ మండపం వద్ద మాటేటి చంద్రయ్య రాజమణి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్,తోట సత్తయ్య,నరేందుల రమేష్, కల్వల సుదర్శన్,అక్కల శ్రీధర్, డ్రైవర్ సత్తన్న, వేల్పుల తిరుమలేష్,లెక్కల ప్రదీప్,కన్నివడి స్వామి, కట్టెల రాము,భక్తులు పాల్గొన్నారు.