భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి -ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి

 

అధికార బలంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చెందిన భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని ఘట్ కేసర్ మండలం కొర్రెముల బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు ప్రభాకర్ రెడ్డి, శివరెడ్డి, రాజేష్ లు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఘట్కేసర్ మండలం, కొర్రెముల గ్రామానికి చెందిన 796 సర్వే నెంబర్ లో గల తాము నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. తమ భూములకు ఆనుకొని ఉన్న భూములను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేశారని చెప్పారు. మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అంటూ తమ భూములను సైతం కలుపుకొని ప్రహరీ నిర్మించారని అన్నారు‌. ఇదేమిటని ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో శ్రమించి కొనుగోలు చేసిన తమ భూములను తిరిగి ఇవ్వాలని సదరు ఎమ్మెల్సీ ని బ్రతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమను వేధింపులకు గురిచేస్తున్న సదరు ప్రజాప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking