ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 07 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట టౌన్ మధ్యాహ్నం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు.గురువారం ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లక్షెట్టిపేట కోర్టు జడ్జి అసదుల్లా షరీఫ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని.చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే అని ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి తమ పనులు చేసుకోవాలని చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవనిహెచ్చరించారు.ఈ కి కార్యక్రమంలో బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు గుడి కొప్పుల కిరణ్, సభ్యులు,ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.