కార్బైడ్ రహిత మామిడి మేళ ప్రారంభం

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ గత 11 సంవత్సరాలుగా స్థానిక పెవెలియన్ గ్రౌండ్ లో కార్బైడ్ రహిత మామిడి మేళ ద్వారా ఖమ్మం నగర ప్రజలకు వివిధ రకాల మామిడి పండ్లని సరసమైన ధరలకు అందజేస్తున్నామన్నారు ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన ఆదర్శ రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో వినియోగదారులకు మామిడి మేళ ద్వారా కార్బైడ్ రహిత మామిడిపండ్లను అందుబాటులో ఉంటాయన్నారు. ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడకుండా ట్రైలలో, రైఫినింగ్ చాంబర్ ద్వారా మామిడి పండ్లను పండించి, విక్రయిస్తుంటారు. చిన్న రసం చెట్టు మామిడి పండ్లు, బంగినపల్లి పళ్ళు లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, మామిడి మేళా ద్వారా వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రకటించారు. 10 కేజీల మామిడి పండ్లను కొనుగోలు చేసే వినియోగదారులకు ఒక కేజీ మామిడిపళ్ళను ఉచితంగా అందజేస్తారు. అదేవిధంగా ఐదు కేజీల మామిడి పండ్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 1/2 కేజీ మామిడి పండ్లను ఉచితంగా అందజేస్తారు. చిన్న రసం చెట్టు రకం మామిడి పళ్ళు కేజీ ధర 80 రూపాయల మేరకు లభిస్తాయి అలాగే పచ్చడి మామిడికాయలు, వంటి మరెన్నో నాటు రకాల మామిడి పళ్ళు లభిస్తాయి. మామిడి మేళాను వినియోగదారులు సందర్శించండి మధురమైన మామిడిపండ్ల రకాలను ఆస్వాదించండి అంటూ ఉత్తమ ఆదర్శ రైతు బానోత్ లక్ష్మణ్ నాయక్ మామిడి ప్రియులకు ఆహ్వానం పలుకుతున్నారు. పెవిలియన్ గ్రౌండ్ తో పాటు వినియోగదారులకు గాంధీచౌక్ లోని మద్ది బాబురావు గారి కాంప్లెక్స్ లో మామిడి మేళా ను అందుబాటులో ఉంచారు. మామిడిపళ్ళతోపాటు ఇక్కడ పచ్చడి కాయలు కూడా అందుబాటులో ఉన్నాయి. 10 కేజీలు 20 కేజీలు కొనుగోలు చేసే వినియోదారులకు డోర్ డెలివరీ సౌకర్యం కూడా మామిడి మేళ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. త్వరలో 15 రోజులు ఫ్రూటీ బ్యాగ్ మ్యాంగోస్ అందుబాటులో రానున్నాయి. ఆదర్శ రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ సెల్ నెంబరు 9908848371, రవీందర్ సెల్ నెంబర్ 9676828365 లకు వినియోగదారులు ఫోన్ చేసి, సంప్రదించవచ్చు అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking