ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం పెంచిన టోల్ ట్యాక్సీను వెంటనే తగ్గించాలని రవాణా రంగ కార్మికులు చలో ఢిల్లీ ఏప్రిల్ 5 జయప్రదం చేయాలని కరపత్రం ద్వారా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపేందర్ త్రీ టౌన్ సిఐటియు కన్వీనర్ ఎర్ర మల్లికార్జున్ ఆటో యూనియన్ నాయకులు వెంకన్న, సంపత్, కోటయ్య, రమేష్ తదితరు డ్రైవర్లు పాల్గొన్నారు