డిజిపి అంజని కుమార్ ను కలిసిన తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ
హైదరాబాద్ జూన్ 27 ;ఈనెల 22వ తారీకు జరిగిన సంఘటన హుజురాబాద్ నియోజకవర్గం లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జి ఎస్ ఆర్ టి వి కెమెరామెన్ పైనఅనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కిడ్నాప్, చేసి బంధించి ,కొట్టి ముదిరాజ్ జాతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా సమాజంలో మాట్లాడలేని విధంగా బూతులు తిడుతూ అడ్డగోలుగా మాట్లాడుతూ జాతి యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ డిజిపిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ ఇతను ఎమ్మెల్సీ పదవికి తగిన వ్యక్తి కాదని అతని మాటలతో సమాజానికి నిరూపితమైనదని అన్నారు. డిజిపి ని కలిసిన వారిలో తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, జగన్మోహన్ ముదిరాజ్ , పగిడాల సుధాకర్ ముదిరాజ్, గుండు నరసింహ ముదిరాజ్ ,నీరజ ముదిరాజ్ ,లక్ష్మణ్ ముదిరాజ్, మురళీకృష్ణ ముదిరాజ్ కృష్ణ మనోహర్ ముదిరాజ్ డాక్టర్ జగన్మోహన్ ముదిరాజ్ హరికాంత్ ముదిరాజ్ బాలు ముదిరాజ్ హరికాంత్ ముదిరాజ్ స్వర్ణలత ముదిరాజ్ శ్యామల ముదిరాజ్ ,ఝాన్సీ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్, ప్రశాంత్ ముదిరాజ్ ,తదితరులు పాల్గొన్నారు.
Prev Post