భవిష్యత్తు దర్శనికుడు కేసీఆర్ ఏ
జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి ప్రజాబలం ఫిబ్రవరి 16
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత భారత దేశ భవిష్యత్తు దార్షానికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేశామని జూలపల్లి జెడ్పిటిసి కెసిఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్ తెలిపారు
.. ఫిబ్రవరి 17 శుక్రవారం ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు జూలపల్లి జెడ్పిటిసి సభ్యులు బొద్దుల లక్ష్మణ్ తెలిపారు ముఖ్యంగా ఈ జన్మ దిన వేడుకలకు రైతులను శ్రామికులను మహిళలను భాగస్వామ్యం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు కేసీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించామని తెలిపారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశలో కేసీఆర్ సేవాదళం పేరిట క్రీడోత్సవాలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు అలాగే రక్తదాన శిబిరాలు రోగులకు పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో భారీగా నిర్వహిస్తున్నట్లు కేసిఆర్ సేవాదళ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దుల లక్ష్మణ్ తెలిపారు