” ప్రజాబలం వార్తకు స్పందన” అంబులెన్స్ అడ్డాల్లోంచి ఆటోలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు

 

జగిత్యాల, ఫిబ్రవరి 16:( ప్రజాబలం ప్రతినిధి) ‘అంబులెన్స్ పార్కింగ్లో ఆటోల పాగా ‘ అనే శీర్షికతో గురువారం ప్రజాబలం దినపత్రికలో వచ్చిన కథనానికి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. హుటాహుటిన పాతబస్టాండ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి ముందు పాగా వేసిన ఆటోలను తొలగించి హెచ్చరించారు. ఇక ముందు అంబులెన్సుల పార్కింగ్ జాగాలో ఆటోలను నిలిపితే కఠిన చర్యలుంటాయని ఎస్.ఐ. రామ్, ఏ. ఎస్.ఐ. సందానిలు హెచ్చరించినట్లు స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సత్వరమే స్పందించడంతో పలువురు అభినందిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking