చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 01 : చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడదామని 14 వ వార్డు కౌన్సిలర్ చింత సువర్ణ కుమారి అన్నారు.శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని 14 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ మొక్కలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం అని మన ఇంటి ప్రక్కన ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచు కోవాలన్నారు.చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా పర్యావరణం కాలుష్యం కాకుండా ఉంటుందన్నారు. అనంతరం కౌన్సిలర్ తో కలిసి మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు డి.మానస, అశోక్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్,కె.రాకేష్,వార్డ్ మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking