‌ బతుకమ్మ సంస్కృతిని కాపాడదాం

సాంప్రదాయ బతుకమ్మ ఆడిన మహిళలకు బహుమతులు

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 15 : లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మన సంస్కృతీ సంప్రదాయాలను,మన బతుకమ్మ గొప్పతనాన్ని నేటి తరం మన పిల్లలకు తెలియచేయాలని ఉద్దేశంతో వెంకట్రావుపేట సేవా సమితి,రైతు మిత్ర ఫర్టిలైజర్స్ ప్రొప్రైటర్ మీస శ్రీను సంయుక్త ఆధ్వర్యంలో సినిమా పాటలు డీజే బాక్సులు లేకుండా లయబద్ధంగా సాంప్రదాయ బతుకమ్మ ఆడిన మహిళలను గుర్తించి వారికి ప్రధమ ద్వితీయ తృతీయ మూడు బహుమతులు అందజేయడం జరిగినది.ప్రథమ బహుమతి వెంకటరావుపేట సేవాసమితి వారు 5000 రూపాయలు అందించగా ద్వితీయ బహుమతికి 3000 రూపాయలు, తృతీయ బహుమతి 2000 రూపాయలు రైతు మిత్ర ఫర్టిలైజర్స్ ప్రోప్రేటర్ మీస శ్రీను అందించడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలు అందరూ సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడినప్పటికీ ముగ్గురికి మాత్రమే బహుమతులు ప్రధానం చేయడం జరిగినది మీ యొక్క ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటూ మహిళలు పెద్దలు మన సంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షించి రాబోయే తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెంకట్రావుపేట సేవా సమితి,రైతు మిత్ర ఫర్టిలైజర్స్ సంయుక్త పిలుపుకు స్పందించిఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరీమణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది అలాగే ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking