బాల కార్మికులు, వెట్టిచాకిరి నిర్ములిద్దాం.
మంత్రి సత్యవత్ రాథొడ్.
హైదరాబాద్ ప్రజా బలం న్యూస్ :-
మానవ అక్రమ రవాణా ను నివారించడానికి మానవత్వంతో మనసున్న మనిషిగా సహకారాన్ని అందించాలని
గిరిజన,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనహక్కుల్ని స్వేచ్ఛను కోల్పోయే విధంగా నిర్బంధించి పని చేయిస్తున్న వారిని గుర్తించి శిక్ష పడేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. యువశక్తి దేశంలో మార్పుకోసం కృషి చేయాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పరిశీలిస్తే వొళ్ళు జలదరిస్తోందని, భాద కలుగుతుందని అన్నారు. తాను ఇక మంత్రిగా గాకుండా ఒక తల్లిగా ఈ సమస్య ను ఏవిధంగా అరికడితే పరిష్కారం దొరుకుతుందనే విషయాన్ని నిశితంగా, కులంకుశంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్పందించి మియాపూర్ సంఘటన లో ప్రభుత్వమే తల్లి తండ్రి అన్ని తానై అదుకున్నారని గుర్తుచేశారు. బాల కార్మికులను గుర్తించి బాలల వికాస కేంద్రంలో చేర్పించి వారిని భావి భారత పౌరులు గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆడపిల్ల పుడితే నామోషీగా భావించి వదిలించుకునే విదంగా అమ్ముకుంటున్నారని అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని అన్నారు. సమాజంలో ఇంకా అనేక మోసాలు, ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు చెప్పాలంటే నోరు రావడం లేదు కానీ చెప్పక తప్పడంలేదని అభం శుభం తెలియని అమాయక అమ్మాయిలను మానసికంగా శారీరకంగా హింసించిన 44 మంది పై ఫోక్స్లో కేసుల్లో నేరం రుజువై శిక్ష పడిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పాస్ట్ టాగ్ కింద సీరియస్ గా తీసుకొని కేసులను పరిష్కార దిశగా కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎఎస్ శ్రీమతి భారతి హోళికేరి మాట్లాడుతూ సమాజంలో సుస్థిర అభివృద్ధి కోసం పిల్లల భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త చట్టాలను రూపిందించి సమర్థవంతంగా పకడ్బందీగా అమలు చేయాలని ఇందుకు పోలీస్, రెవెన్యూ, లేబర్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సమన్వయం తో సమిష్టిగా ముందుకు వెళ్ళితే నేటి సమావేశానికి సార్థకత లభిస్తుందని అన్నారు. ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్, ప్రివెన్షన్ తో తల్లిదండ్రులు తమ పిల్లల హక్కులు సంరక్షణకు దోహదపడాలని అన్నారు. పిల్లల విద్యా హక్కుకు భంగం కలుగకుండా మౌలిక హక్కుగా భావించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే భాద్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు కారణంగానే కొన్ని రకాల నేరాలకు దారితీస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు జానకి రామ్ గౌడ్,గడ్డం ప్రశాంత్ కుమార్, డాక్టర్ గంగాధర్, జె.శ్రీనివాస్ రావు, బృందాధర్ రావు, కమాండర్ అశోక్ కుమార్, డాక్టర్ కృష్ణ, పి.అంజన్ రావు, దేవయ్య, రఘు, జ్యోతి, అపర్ణ, శోభారాణి, స్వరూపారాణి, రేచల్ ప్రాజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.