మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఆదేశాను సారము 27 ఏప్రిల్ 2023 న కోర్టు ప్రాంగణము మెదక్ లో ప్యానల్ లాయర్స్ తో శ్రీ. సి.హెచ్. జితేందర్ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్,
జిల్లా న్యాయసేవాధికార సంస్థ మెదక్ గారి ఆధ్వర్యంలో సెన్సిటైజేషన్, ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో ప్యానల్ లాయర్స్ కు చైల్డ్ రైట్స్ , సీనియర్ సిటిజన్స్ యాక్ట్ , యాసిడ్ అటాక్స్,
నాల్స స్కీమ్ ఫర్ ఉమెన్ , లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్ ఆఫ్ యాసిడ్ అటాక్స్ మరియు ప్యానల్ లాయర్స్ యొక్క డ్యూటీ ఇట్టి అంశాల పైన శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో న్యాయవాది సురేష్ , సీనియర్ న్యాయవాదులు ప్యానల్ లాయర్స్ తదితరులు పాల్గొన్నారు.