ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలకేంద్రానికి చెందిన కానిగంటి లక్ష్మణ్ వర్మ ని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘ ప్రచారకార్యదర్శిగా నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు లక్కరసు ప్రభాకర్ వర్మ,రాష్ట్ర యువజన అధ్యక్షులు సాదే పరమేష్ తెలిపారు.ఈ సందర్భంగా కానిగంటి లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ…రాష్ట్ర పెరిక కార్యవర్గంలోకి తీసుకున్నందుకు పెరిక సంఘం పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,నన్ను యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,నాకు తోడున్న మంచిర్యాల జిల్లాలోని పెరిక సంఘం పెద్దలకు,యువ నాయకులు, మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, జన్నారం మండల పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పెద్దల ఆశీస్సులతో నావంతుగా పెరిక సంఘానికి చెందిన ఎల్లవేళలా నా మీయొక్క సహాయ సహకారాలతో పెరిక సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ వంతు కృషి చేస్తానని తెలిపారు.