జనసేన బలోపేతానికి కృషిచేద్దాం

నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్

జగిత్యాల ప్రతినిధి, జూన్ 19(ప్రజా బలం) జగిత్యాల జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరం కృషిచేద్దామని జనసేన జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హోటల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ త్వరలోనే జనసేన-పవనన్న ప్రజాబాట కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమై పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూ పల్లెపల్లెనా జనసేన జెండా నిర్మాణ కార్యక్రమాలతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. జనసేన బలోపేతానికి ప్రతిఒక్కరు నిరంతర కృషి చేయాలని జనార్దన్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జగిత్యాల మండల అద్యక్షులు బొల్లి రాము, ఉపాధ్యక్షులు లక్ష్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శనిగరపు రాకేష్, సెక్రటరీ గొడుగు శ్రీనివాస్, కిరణ్ సింగ్ తాటి పెళ్లి అజయ్, గౌతమ్, కొంగరి శివ కుమార్, గంగాధర్, వడ్లురి హరీశ్, రాయికల్ మండలం కాసవేని మల్లికార్జున బాబు, బొద్దుల శివ కుమార్ బాబు, వీర, మహిళ విభాగం మోగులోజి విజయ, స్వప్న, పద్మ, శ్రావణి, గీత, కోరుట్ల నాయకులు ఆజయ్ కుమార్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking