జిల్లాలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికలు

 

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 14 : లోక్ సభ ఎన్నికలు-2024 లో భాగంగా 002-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో 002-చెన్నూర్ (ఎస్. సి.),003-బెల్లంపల్లి (ఎస్. సి.), 004-మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల లోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో గల స్ట్రాంగ్ రూమ్ లలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సమీర్ నైరంతర్య సమక్షంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు),బెల్లంపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి బి. రాహుల్, డి. సి. పి. అశోక్ కుమార్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి,మంచిర్యాల సహాయ రిటర్నింగ్ అధికారి వి. రాములు, ప్రత్యేక ఉపపాలనాధికారి (ఎల్. ఎ.ఆర్ & ఆర్),చెన్నూర్ సహాయ రిటర్నింగ్ అధికారి డి.చంద్రకళ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని, జూన్ 4వ తేదీన కౌంటింగ్ కార్యక్రమం ఉంటుందని,6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు.జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని,ఈ క్రమంలో రాజకీయ పార్టీలు సహకరించడం సంతోషంగా ఉందని,జిల్లాలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.జిల్లాలో ఎన్నికల నిర్వహణ కొరకు 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు,నీడ,ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ సరఫరా,ర్యాంపులు, మూత్రశాలల సౌకర్యాలతో పాటు వేసవి దృష్ట్యా ఓ.ఆర్. ఎస్.ప్యాకెట్లు,మందులు,ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking