నూతన సాగుకు బాటలు వేసిన మహానీయుడు స్వామినాథన్

ఆయన మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 28(ప్రజాబలం) ఖమ్మం హరిత విప్లవం పేరుతో నూతన సాగుకు బాటలు వేసిన మహానీయుడు ఎం.ఎస్. స్వామినాథన్ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ది సాధించేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి దేశ వ్యాప్తంగా తక్కువ ఆదాయం పొందుతున్న ఎంతో మంది రైతుల జీవితాలను మార్చేసిందని కొనియాడారు. ఆయన మృతి భారతదేశ వ్యవసాయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking