తెలంగాణ రాష్ట్రం లో ఆలయాలకు మహర్దశ

 

దీలవార్ పూర్ ఎల్లమ్మ ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండల కేంద్రం లో రూ 50 లక్షల నిధులతో నూతనంగా పున: నిర్మించనున్న ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన భీమన్న ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధి కి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీలవార్ పూర్ గ్రామంలో లో 1 కోటి 50 లక్షల తో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 50 లక్షల తో రేణుక ఎల్లమ్మ దేవాలయం, 20 లక్షల తో కోనేరు నిర్మాణం, ఏక్ నాథ్ ఆలయానికి 50 లక్షలు, పోచమ్మ ఆలయానికి షెడ్ కు 16 లక్షల 50 వేలు, భీమన్న ఆలయాన్ని 10 లక్షల తో నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గ లో 600 పైగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని తెలిపారు.అంతకుముందు మంత్రి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking