ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తిని రక్షించిన మహేష్

( క్విక్ రెస్పాన్స్ టీం)

అభినందించి రివార్డు అందజేసిన

ఎస్.పి.శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

ప్రజా బలం దినపత్రిక- మెదక్ జిల్లా ప్రతినిధి 4-09-2024:

వరద ప్రవాహం లెక్కచేయకుండా సాహసోపేతంగా ఓ వ్యక్తిని కాపాడడం అభినందనీయం
తన వాళ్లకు ఏమైనా ఇతరుల సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులు
జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ.. మెదక్ జిల్లా టెక్మాల్‌ పోలీస్ స్టేషన్ పరిది గుండు వాగులో చోటుచేసుకున్న విషయం అతడిని జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం కాపాడటం విదితమే అని అట్టి టీం సబ్యులను ఈ రోజు జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి వారికి క్యాస్ రివార్డ్ అందించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వరద ప్రవాహం లెక్కచేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం సాహసోపేతంగా ఓ వ్యక్తిని కాపాడడం అభినందనియమని 24 గంటలు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చేసే వ్యవస్థ పోలీస్‌. తన వాళ్లకు ఏమైనా ఇతరుల సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులని దండెత్తి శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనికులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసాను ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులని ఈ సంఘటన రుజువు చేసిందని ఈ సందర్భంగా అన్నారు. పోలీస్ శాఖ అత్యంత బాధ్యతాయుతమైన వ్యవస్థ అని, విధుల పట్ల అంకితభావం గా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. అలాగే సామాజిక మాధ్యమం అయిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వేదికగా మెదక్ జిల్లా పోలీస్ హోమ్ గార్డ్ మహేష్ గారిని జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం సబ్యులను తెలంగాణ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ జితేందర్ ఐపీఎస్ మరియు ఏ.డి.జి శ్రీ మహేష్ భగవత్ ఐపీఎస్ అభినందించినారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి.అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ ,జిల్లా సాయుద ధల డిఎస్పీ శ్ రంగ నాయక్ , ఆర్.ఐ శ్రీ.శైలేందర్ ,ఎస్బీ సిఐ శ్రీ. సందీప్ రెడ్డి గారి,ఏ. ఆర్. ఎస్.ఐ శ్రీ. మహిపాల్ గారు , జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం సబ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking