అంగన్వాడీ సెంటర్లలో పోషణ మాసోత్సవాలు నిర్వహించిన టీచర్లు
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి,4-09-2024:
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో పోషణ మాసోత్సవ కార్యక్రమాలను ఆయా అంగన్వాడీ సెంటర్లలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని పిట్లంబేస్, వడ్డెర కాలనీల్లోని అంగన్వాడీ సెంటర్లలో ఐసీడీఎస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు సంబంధిత శాఖ అధికారిణి నాగమణి, అంగన్వాడీ టీచర్లు స్మరణ, రేణుక, పోచమ్మ, మమత, లక్ష్మీ, శివరాణి, కవిత తదితరులు పౌష్టికాహారంపై మినిట్స్, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, బెల్లం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ప్రతిరోజూ తినే ఆహారంలో సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా పిట్లంబేస్ అంగన్వాడీ సెంటర్లో టీచర్లు రేణుక, స్మరణ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాల్లో మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ నాగమణి మాట్లాడుతూ… చైల్డ్ మ్యారేజ్, వరకట్న వేధింపులు, గృహహింస, సఖి సేవల గురించి వివరించారు. బాలికలకు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 181,1098,100 అత్యవసరంలో ఉపయోగించుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా .తల్లులందరికీ సరైన పోషకాహారం, సమతుల ఆహారం, చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవాలని జాగ్రత్తలను తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పిల్లల పెరుగుదల కుంటు పడితే జరిగే అనర్ధాలు, తీవ్ర లోప పోషణకు సంబంధించి వివరాలను గర్భిణిలు, బాలింతలు, మహిళలకు తెలిపారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం సోషల్ వర్కర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా మానసిక సమస్యలు ఉంటే14416 టోల్ ఫ్రీ కి కాల్ చేసి కౌన్సిలింగ్ సేవలు కూడా పొందవచ్చనక్నారు. అనంతరం గర్భిణీలు, బాలింతలు, మహిళలు పౌష్టికాహారం తీసుకుంటామని… అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.