బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతం చేయండి.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 01

జమ్మికుంట పట్టణములోని ప్రెస్ క్లబ్ లో బిజేవైఏం నాయకుల పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర రెండో విడత ప్రారంభమైన సందర్భంగా జమ్మికుంట పట్టణానికి వస్తున్న సందర్భంగా పట్టణంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్రలో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలియజేస్తారు.రాబోయే పార్లమెంట్ స్థానానికి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ పోటీ చేయబోతున్నారు.దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానీ కావాలని అందుకోసం తెలంగాణ నుండి అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలిపించాలని,
ప్రజాహిత యాత్రలో కార్యకర్తలు,నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కైలాసకోటి గణేష్, శ్రీవర్తి ప్రవీణ్, జార్క శ్రీనివాస్, దార కృష్ణ, గట్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking