అయోధ్య రామ మందిరం అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం ఈనెల 22న అయోధ్య రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఈరోజు కామేపల్లి మండలం బండిపాడు,రాయి గూడెం, రిక్కి తండా గ్రామాలలో అయోధ్య నుండి వచ్చినపవిత్రమైన అక్షింతలను భక్తిశ్రద్ధలతో ఇంటింటికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొంగులేటి ప్రధాన అనుచరుడు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ గ్రామంలోని ప్రజలతోపాటు జైశ్రీరామ్, నినాదాలతో గ్రామంలో ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ
దాదాపు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో తిరిగి రామాలయం పునరుద్ధరించబడుతుందని, లోక కళ్యాణార్థం బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈనెల 22న జరుగుతుందని, ఆ రోజున దేశంలోని ప్రతి పట్టణాల్లో గ్రామాలలో వాడవాడలా ఒక పండుగ వాతావరణం లాగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి రెండు గ్రాముల చొప్పున అక్షింతల పంపిణీ జరుగుతుందని, ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న రోజున వాటిలో ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలను కలిపి దేవాలయానికి తీసుకువెళ్లి పూజా కార్యక్రమం జరుపుకొని ఇంటికి తీసుకువెళ్లి దేవుని పటం దగ్గర ఉంచుకోవాలని, శుభకార్యాలు జరుపుకున్నప్పుడు అక్షింతలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భానోత్ నరసింహ నాయక్, మేకల లక్ష్మీనారాయణ,కొప్పుల వెంకన్న, పరిమిశెట్టి సాంబయ్య, బండి లక్ష్మి నర్సు, బండి ఉపేందర్, కొప్పుల రాధమ్మ గుగులోతు రవి, మేకల మహేష్ బాబు ఓరుగంటి యుగంధర్, చెన్నబోయిన కృష్ణ చిన్నబోయిన సత్యం, ఉబ్బని రాములు, ఉబ్బని ప్రసాదు ఓరుగంటి సైదులు, బానోత్ బాలకృష్ణ చిన్నబోయిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking