ఫిట్స్ తో ప్రాణాపాయ స్థితిలో వున్న మహిళను కాపాడిన రక్షకభటులు.
పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ ఎసిపి సారంగపాణి, సిఐ అశోక్ అభినందనలు
ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఒక మహిళ అకస్మాత్తుగా నడుస్తూ పడిపోయింది అక్కడే విధులు నిర్వహిస్తున్న ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు శ్రీనివాసరావు జె సాయిలు హోంగార్డ్ ఆఫీసర్ వీరభద్రంలు స్పందించారు వెంటనే ఆమె వద్దకు వెళ్లి అమే పరిస్తితిని గమనించగా ఫిట్స్ వలె ప్రాణాపాయంలో వున్న ఆమెను వెంటనే ప్రాథమిక చికిత్స కోసం 108 కు ఫోన్ చేసి అమే ప్రాణాలను నిలిపారు..ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందించిన సేవలకు గాను ఖమ్మం ట్రాఫిక్ ఎసిపి సారంగపాణి, సిఐ అశోక్ లు ప్రత్యేకంగా అభినందించారు.దీంతో ఖమ్మం ప్రజానీకం మహిళా ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులకు సలాం చేశారు