స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ మరియు జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు బహుమతులు అందజేత
మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ మరియు జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తూప్రాన్ మండల స్థాయిలో మూడు రోజులు నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు సందర్భంగా ముఖ్య అతిథి జి.యం.ఆర్ పోచంపల్లి హైవేస్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ వెంకటరమణ, లక్ష్మణరావు గార్ల చేతుల మీదుగా గెలిపొందిన విధ్యార్థులకు పతకాలు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా జి.యం.ఆర్ పోచంపల్లి హైవేస్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ చదువు ఒక్కటే విద్యార్థికి పరమావధి కాదని, విద్యతో పాటు శారీరక, మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి అనుకున్న లక్ష్యం సాధించగలరన్నారు. దీని కోసం క్రీడా నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నారు. చదువుతోపాటు సమానంగా ఆటలు ఆడటం వల్ల వ్యక్తి చాలా ధృడంగా ఉండటానికి దోహతపడుతుందని మరియు మానసికంగా కూడా ఎంతో ప్రోత్బలం చేకూరుతుందని అలాగే రోజుకు కనీసం ఒక గంట పాటు ఆటలు ఆడటానికి కేటాయించేలా చూసుకోవాలని విధ్యార్థులకు సూచించారు. తదనంతరం గెలిపొందిన విధ్యార్థులకు పతకాలు అందజేసి వారందరినీ అభినందించారు. అనంతరం జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైతే బాగా ఆటలాడుతారో వారు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా తయారై చదువులో అందరికంటే ముందు స్థానంలో ఉంటారని మరియు జీవితంలో ఎదురయ్యే అనేక ఓటములకు కృంగిపోకుండా క్రీడా స్ఫూర్తితో గెలవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారని సూచించడం జరిగింది. ఆలాగే మున్ముందు ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే క్రీడా పోటీలకు సహకరిస్తామని తెలియజేసారు. అలాగే ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగిన క్రీడా పోటీలకు సహకరించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ను జి. యం.ఆర్ సంస్థ సభ్యులు శాలువాలతో సన్మానించారు.

అనంతరం స్కూల్ గేమ్స్ ఆప్ ఫెడరేషన్ మెదక్ జిల్లా సెక్రెటరీ శ్రీ గంగాల రమేష్ గారు మాట్లాడుతూ మూడు రోజులు జరిగే ఈ క్రీడలను క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకున్నామని మరియు సహకారం అందించిన జి.యం ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ భారతి కోడె మరియు ఈ క్రీడా పోటీలకు మూడు రోజుల పాటు ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు వివిధ పాఠశాలల క్రీడాకారులతో కలసి అన్నీ తనై ముందుండి ఈ మండల స్థాయి క్రీడా పోటీలను దిగ్విజయంగా పూర్తి చేసిన ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిఎంఆర్ పోచంపల్లి హైవేస్ మేనేజర్స్ వెంకటరమణ, లక్ష్మణరావు, జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మురళి, ఎస్.జి.ఎఫ్ జిల్లా సెక్రెటరీ రమేష్,ఫిజికల్ డైరెక్టర్శ్వేత, సరోజినీ, బాలేష్, నవీన్, సూర్య రక్ష ఏ.య.స్ ఓ చరణ్, రామక్రీష్ణ మరియు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .