మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ లకు వినతి పత్రం అందించిన జైరాం బద్దం సతీష్ గౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారంనాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని రెవిన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు ని మరియు పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మరియు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి ని మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి గోషామహల్ నియోజకవర్గం మంగలహాట్ డివిజన్ ప్రాంతంలోని సీఐబీ క్వార్టర్స్ వద్ద వున్నా హోసింగ్ బోర్డు కు సంబంధించిన ఖాళీ స్థలం కబ్జా కాకుండా కాపాడి గతంలో గృహ నిర్మాణా బోర్డు తరఫున ప్రహరీ గోడ ను నిర్మించే ప్రయత్నం ను కబ్జా దారులు కాంట్రాక్టర్ ను భయబ్రాంతులకు గురిచేసి పనులను ఆపడం జరిగింది అని తెలుపుతూ అ యొక్క ప్రాంతంలో కల్యాణ మండపము నిర్మించాలని సూర్య యూత్ అసోసియేషన్ మరియు గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్ తరఫున మంత్రిని కోరడం జరిగింది. మంత్రి చాలా సానుకూలముగా స్పందించారు.

గన్‌ఫౌండ్రి డివిజన్ ఈసమియా బజార్ మేఘరాజ్ భవన్ వద్ద వున్నా ఖాళీ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం. మహిళ భవనం నియోజకవర్గం అభివృద్ధి నిధుల ద్వారా నిర్మించాలని కోరిన వెంటనే సానుకూలంగా స్పందించారు.ఈ కార్యాక్రమంలో జైరాం సూర్య యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పరమేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్. వై స్ వినోద్ కుమార్ వైస్ ప్రెసిడెంట్. జాసన్ రిచర్డ్ వైస్ ప్రెసిడెంట్. రవీందర్ కోశాధికారి. బద్దం సతీష్ గౌడ్ కన్వీనర్ గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. తదితరులు పాల్గొన్నారు.