మహబుబాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) మార్చి19:
ములుగు అసెంబ్లీ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలకు అభివృద్ధి పనిలో భాగంగా” రహదారులు” రోడ్డు నిర్మాణ పనులు భాగంగా బీటీ రోడ్లు గ్రామాల లింకు రోడ్లు కల్వర్టు లు, బ్రిడ్జిలు నిర్మాణ పనుల కోసం వెనుకబడిన ఉమ్మడి మండలాలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల వ్యవధిలోని ఉమ్మడి మండలాలకు 95 కోట్ల రూపాయల గల నిధులు ప్రభుత్వ పరంగా విడుదల చేశారు ఏజెన్సీ మండలాలు కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాలకు ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వపరంగా భారీగా నిధులు విడుదల చేసిన మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు
కొత్తగూడ ఎంపీపీ బానోత్ విజయ రూప్సింగ్, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, కొత్తగూడ జెడ్పిటిసి పులుసం పుష్పలత శ్రీనివాస్, గంగారం జెడ్పిటిసి ఈసం రమ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.