రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 అక్టోబరు 2024
బి.ఆర్.ఎస్ పార్టీ తరఫున మణికొండ పురపాలక సంఘ పరిధిలోని నెక్నంపూర్, నెమిలీనగర్, పుప్పలగూడ, వేంకటేశ్వర కాలనీ, బాపు హిల్స్ కాలనీ, పంచవటి కాలనీ లలో అద్వాన్న స్థితిలో ఉన్న రోడ్ల పరిస్థితి, వీధి దీపాల గురించి పలుమార్లు స్థానిక మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నప్పటికీ పనులు కాకపోవడంతో మాసాబ్ ట్యాంక్ లో ఉన్న కమిషనర్ మరియు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వి.పి గౌతమ్ ను కలసి వారికి రోడ్ల దుస్థితి, నాసిరకం పనులు మరియు మెయింటినెన్స్ పనుల గురించి తెలిపి అనతి కాలంలోనే వీధి దీపాలు మూడు, నాలుగు రోజులకే పాడై పోయే పరిస్థితి కూడా వివరించడం జరిగింది. రోడ్లు గుంతల మయం మరియు వీధి దీపాలు లేని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగింది. కావున నాసిరకం ఇంజనీరింగ్ పనులు మరియు విద్యుత్ దీపాల పనితీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, అందె లక్ష్మణ్ రావు, ఉపేందర్ రెడ్డి, సంగం శ్రీకాంత్, కందడ ప్రవీణ్ కుమార్, యలాల కిరణ్, షేక్ అస్ఫాక్ అలీ, షేక్ ఆరిఫ్, బిన్నీ, కీర్తి లతా గౌడ్ తది తరులు పాల్గొన్నారు.
Prev Post