కదం తొక్కిన మణికొండ బీ.ఆర్.ఎస్ కార్య కర్తలు.

రాజేంద్రనగర్ ప్రజా బలం ప్రతినిధి 24 జులై 2024: రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల్లో యువనాయకుడు పట్లొల్ల కార్తీక్ రెడ్డి పాల్గొని అనుభవజ్ఞులైన నాయకులకు మణికొండలో లోటు లేదనీ ఈ సమావేశానికి విచ్చేసిన వారిని చూస్తే తెలిసిపోతుందని, అందుకు తాను ఎంతో సంతోష పడుతున్నానని, చిన్నా చితకా సమస్యలకు బెదరవద్దని, పరిణామల గురించి ఆలోచించ వద్దని అందరం కలసి కట్టుగా పార్టీ మనుగడకే పనిచేద్దామని, రాబోయే తరుణంలో రాజేంద్ర నగర్ లోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబి జెండా రెప రేపలాడుతుందని భరోసా కల్పిస్తూ ఎల్లవేళలా మణికొండ వాసులకు సహాయ సహకారాలందించడానికి తాను ముందుంటానని అట్టి అవకాశాన్ని తనకు కలుగ జేయాలని కోరుకున్నారు, ఈ కార్య క్రమంలో సీతారాం ధూళిపాళ, డాక్టర్ కర్నాటి శ్రీనివాస్, మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్, కౌన్సిలర్లు వసంత్ రావ్ చౌహాన్, ఆలస్యం నవీన్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డీ, సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, డీ. నర్సింగ్ రావు, అందె లక్ష్మణ్ రావు, ఉపేంద్రానాథ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, కీర్తిలతా గౌడ్, విజయలక్ష్మి, శ్రీకాంత్, షేక్ ఆరిప్, రామ సుబ్బారెడ్డి, సురేఖ, యువ నాయకులు మహేష్, బాబు, దిలీప్, కిరణ్, భాను, బాలాజీ, తిరుపతి, ఎల్లాస్వామి తదితర నాయకులతో దిమ్మ తిరిగే విధంగా, బీ.ఆర్.ఎస్ ముఖ్య కార్య కర్తల సమావేశాముగా పరివర్తన చెంది విశేష స్పందన లభించిందనీ, హాల్ మొత్తం కిక్కిరిసి పోయినదని ఇంకనూ చాలామంది కార్య కర్త సోదర సోదరీ మణులు రాకుండా యక్ష ప్రయత్నాలు చేసినారని తెలియ పరచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking