వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 23:
రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రికొండ సురేఖ శనివారం మంత్రిగా మొదటిసారిగా వరంగల్ నగరానికి విచ్చేశారు. వరంగల్ బట్టల బజార్ లోని బాగా నగర వెంకటేశ్వర స్వామిని దర్శించినారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి భాజా భజంత్రీలతో ఆలయంలోనికి ఘనంగా స్వాగతం పలికారు. పూజ నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛరణలతో మహా ఆశీర్వచనం నిర్వహించిన పురోహితులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి విచ్చేసిన ప్రజలతో మాట మంతి చేసిన ఆమె ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవోకు సూచించారు ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు పరిశురం, ఆలయ పూజారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.