శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో సేమి క్రిస్మస్‌ వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో సేమి క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు మేరీ శాంతా క్లాస్ దేవదూతల వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. చిన్నారులు క్రిస్మస్ సందేశాన్ని చాటే పలు నాటికలు, కీర్తనలతో సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనాన్ కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు ఆనంతరం స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి ప్రతీకగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించామని, విద్యార్థులు అన్ని రంగాల్లో పాలుపంచుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరారు కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking