నూతన సంవత్సరం సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర
కేక్స్ కట్ చేసి,కేలండర్స్ ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు
ఖమ్మం ప్రతినిధి జనవరి 1 (ప్రజాబలం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రవిచంద్ర
నూతన సంవత్సరం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసానికి సోమవారం పలువురు ప్రముఖులు,యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు ఎంపీ వద్దిరాజు బంజారాహిల్స్ లోని స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి, జూబ్లీహిల్స్ కొండపై కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాలను తన ఆప్తమిత్రుడు రవీందర్ రెడ్డితో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితుల ఆశీర్వచనాలు, స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.ఎంపీ రవిచంద్ర తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే.టీ.రామారావును కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు మున్నూరుకాపు ఎపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుట్టం పురుషోత్తం రావు, మున్నూరుకాపు ప్రముఖులు వెంకటేశ్వర్లు, త్రినాథ్,జెన్నాయికోడే జగన్మోహన్,విష్ణు,పద్మశాలి సంఘం నాయకుడు రాంచందర్ తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.ఖమ్మంకు చెందిన వద్దిరాజు రవిచంద్ర యూత్,రవన్న యువసేన సభ్యులు ప్రచురించిన నూతన సంవత్సర కేలండర్స్ ను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యువకులు ఆయన చేత కేక్స్ కట్ చేయించారు, శాలువాలతో సత్కరించారు