రఘునందన్‌ పై మర్రి గెలుపు ..

-కార్మిక పక్షపాతి మర్రి రాజశేఖర్‌ రెడ్డి
– ఎంటిఏఆర్‌ ఎన్నికల్లో మర్రి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన నాయకులు
ప్రజాబలం ప్రతినిధి ( హైదరాబాద్‌): కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని బీఅర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ పార్లమెంట్‌ మరియు కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్‌ మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. గురువారం రోజు ఎంటిఏఆర్‌ టెక్నాలజీ లి. కంపెనీకి జరిగిన ఎన్నికల్లో బిఎంఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పై బిఆర్టియు అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌ రెడ్డి కార్మక సంఘం అధ్యక్షుడి ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి గా మాయ రాజయ్య ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎంటిఏఆర్‌ ఎన్నికల్లో తమ గెలుపుకు సహకరించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బిఆర్టియు సంఘం కార్మికుల కోసం వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ కంపెనీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలపై పోరాటం చేసి వారికి రావాల్సిన హక్కుల కోసం అటు యజమాన్యంతో చర్చిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ కార్మక శాఖా మంత్రి మల్లారెడ్డి కార్మికుల కోసం పెద్దపీట వేస్తున్నారని, బిఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ కార్మిక పక్షపాతిగా నిలుస్తుందన్నారు. ఇంతటి ఘన విజయం అందించిన కార్మికులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మర్రి రాజశేఖర్‌ రెడ్డి విజయం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల చైర్మన్‌ పి. నారాయణ , బిఅర్టియు మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌, మల్కాజ్‌ గిరి పార్లమెంటు బిఅర్టియు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ మరియు ఈఎస్‌ఐ బోర్డు మెంబర్‌ వెంకటరమణారెడ్డి , చారి తదితరులున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking