సనత్‌నగర్ ప్రజాబలం ప్రతినిధి:బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో తాజ్ బంజారా చెరువు దగ్గర కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లారీలు ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకి మరియు జోనల్ కమిషనర్ కి సమాచారం అందించారు.

దీంతో అక్కడకు చేరుకున్న బంజారా హిల్స్ పోలీసులు దంపింగ్ చేస్తున్న రెండు ట్రిప్పర్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన రోడ్డు మీద జీ హెచ్ ఎమ్ సి పార్క్ గేట్ నుంచి లోపలకి వెళ్లి ప్రైవేట్ వ్యక్తులు ఎలా డంపింగ్ చేస్తున్నారు వారికి సహకారం అందిస్తున్న వారు ఎవరు అనే అంశంపై విచారణ చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.