విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న మెదక్ చర్చ్

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన సీఎస్ఐ నిర్వాకులు .

వివిధ రాష్ట్రాల నుంచి తరలి రానున్న భక్తులు

ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు

మెదక్ డిసెంబర్ 25 ప్రాజబలం న్యూస్ :-

కరుణామయుడి జన్మదిన వేడుకలకు ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. రంగురంగుల విద్యుదీపాల కాంతులతో చర్చి శోభాయమానంగా కనపడుతోంది. బిషప్‌ పద్మారావు ఆధ్వర్యంలో మహాలయంలో నిర్వహించే ప్రార్థనలకు చర్చి కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తొలి ప్రార్థన ప్రారంభమైంది.

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చే ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలు, విదేశీయుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు కమిటీ తెలిపింది. చర్చిలోపల కూడా క్రిస్మస్‌ ట్రీ, మేరీమాత, ఏసుపుట్టిన గట్టాల ప్రదర్శనతో పాటు చుట్టూ అలంకరించారు. చర్చి బయట ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ తాత బొమ్మ ఆకట్టుకుంటోంది.

ఉదయం 4 గంటల నుంచి

తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన శిలువ ఊరేగింపుతో ప్రారంభించారు. అనంతరం బిషప్‌ పద్మారావు వాక్యోపదేశం చేశారు. రెండవ ఆరాధన ఉదయం 9.30 గంటలకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి దైవ సందేశం చేశారు. భక్తులకు దీవెనలిచ్చేందుకు మెదక్ పాస్టర్లతో పాటు హైదరాబాద్‌ వేద కళాశాలకు చెందిన 12 మంది పాస్టర్లు అందుబాటులో ఉన్నారు. సీఎస్‌ఐ పరిధిలోని కళాశాలలు, హాస్టల్స్‌, వసతి గృహాలను భక్తుల సౌకర్యార్థం సిద్ధంగా ఉంచాం. క్రిస్మస్‌ తర్వాత మరో రెండు రోజులు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.

పటిష్ట పోలీసు బందోబస్తు

మెదక్‌ జిల్లా ఏఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో 535 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

కిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ సందర్భంగా ప్రజలకు మెదక్ ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర అటవీ శాఖ కొండ సురేఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు రమేష్,. వెంకటేశ్వర్లు, టీఎన్జీవో అధ్యక్షుడు దొంత నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking