ప్రభుత్వ విద్యా బోధనకు మెదక్ జిల్లా పాఠశాలలు ఆదర్శం

 

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
18.09.2024:

నాణ్యమైన పోషకాహారం , క్రమశిక్షణ ఉత్తమ విద్యా బోధనకు మెదక్ జిల్లా అంగన్వాడి సెంటర్స్ , ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శం జిల్లా కలెక్టర్
అంగన్వాడి సెంటర్ పిల్లల చెప్పిన పద్యాలకు ముగ్దుడై ఉత్తమ బోధనకు అంగన్వాడి సెంటర్ టీచర్ ను సన్మానించిన కలెక్టర్
క్షేత్రస్థాయిలో పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామంలో పాఠశాల, అంగన్వాడి సెంటర్ పరిశీలించి సంతృప్తి చెందిన కలెక్టర్
నాణ్యమైన పోషకాహారం ఉత్తమ విద్యా బోధన క్రమశిక్షణకు ప్రతిరూపాలు మెదక్ జిల్లా అంగన్వాడి సెంటర్స్, ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తాయని
జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా
పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామంలో
విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్ పరిశీలించిన అనంతరం గ్రామ పరిసరాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ఉత్తమ విద్యా బోధన అందుతుందని అంగనవాడి పిల్లల సామర్ధ్యాలు స్వయంగా పరిశీలించడం జరిగిందని ఉత్తమ విద్యాబోధన అందించిన అంగన్వాడి టీచర్ ను, ఆయాను సన్మానించి అభినందించడం జరిగిందని చెప్పారు.,అంగ‌న్‌వాడీలో చ‌దువుకునే పిల్ల‌ల‌కు అత్యుత్త‌మ బోధ‌నతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ. ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు
మెరుగుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలో పరిటిస్తూ గ్రామాల సచ్చతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని . పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత ఆయన పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking