ప్రజా బలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గఓ
18.09.2024:
గ్రామ పంచాయతీల్లో గల వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను రూపొందించి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించిన ఈ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
బుధవారం నాడు, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో డిపిఓ యాదయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల తరువాత మండలాల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు జరగవచ్చని తెలిపారు.
ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామని , వాటిని పరిశీలించి, వాటిలో అభ్యంతరాలను తెలియజేయాలని, తద్వారా ఓటర్ల వివరాల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేయవచ్చని, ఇంతకుముందు అసెంబ్లీ, పార్లమెంట్, ఎంఎల్సీ ఎన్నికల వలె ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సహాయ సహకారాలు అందించాలని వివిధ పార్టీల ప్రతినిధులను కోరారు.
> ఇట్టి ప్రచురించిన ఓటర్ల జాబితాని గత పార్లమెంట్ ఎన్నికల ఓటర్ల జాబితా అయిన తేదీ. 08.02.2024 నాటి జాబితాని తీసుకొని వార్డుల వారిగా చేయటం జరిగింది
> ఇట్టి ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నాను తేది. 14.09.2024 నుండి 21.09.2024 వరకు అభ్యంతరాలని లేఖ ద్వారా వారి సంభందిత మండల ఎంపీడీఓ గారికి కానీ వారి గ్రామ పంచాయతి కార్యదర్శి కి గాని తెలపలని చెప్పడం జరిగింది.
> 21.09.2024 తరువాత ఎటువంటి అభ్యంతరాలని స్వీకరించబోమని తెలిపినారు.
> మండల స్థాయి లో కూడా తేదీ.19.09.2024 రోజున రాజకీయ పార్టీ లతో సమావేశం నిర్వహిస్తాము అని తెలిపారు.
> గ్రామ పంచాయతీల నందు తుది ఓటర్ల జాబితాని తేదీ. 28.09.2024 రోజున ప్రచురణ చేస్తారు అని తెలిపినారు.
ఈ సమావేశంలో వివిధ పొలిటికల్ పార్టీ నిధులు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
