రాష్ట్రస్థాయి మహిళల ఫుట్బాల్ రన్నర్ గా మెదక్ జిల్లా జట్టు ఎంపిక

 

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి
20 ఆగస్టు 2024:

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును జిల్లా
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు నిజాంబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో రన్నరపుగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన చాంబర్లో క్రీడాకారులను,
వీరితోపాటు జాతీయస్థాయిలో జూనియర్ ఫుట్బాల్ విభాగంలో బంగారు పథకం సాధించిన అంకిత్ ను అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం కల్పిస్తుంది అన్నారు .
మెద క్ లోని ఇందిరాగాంధీ స్టేడియం మరమ్మత్తులను ఇప్పటికే పూర్తి చేసి ఫుట్బాల్ క్రీడా మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో తీసుకొచ్చామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయిలో రాణించాలన్నారు.
ఈ మధ్యనే క్రీడాకారుల అభ్యర్థుల మేరకు ఫుట్బాల్ మైదానం లెవలింగ్ చేయిస్తున్నట్లు వివరించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నగేష్ సంయుక్త కార్యదర్శి, శిక్షకులు ప్రకాష్, భాగ్యమ్మ, వినయ్ , బాణి మరియు ఫుట్బాల్ అకాడమీ సభ్యులందరినీ కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking