రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలూ
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని పక్కడ్బందీ గా నిర్వహించాలి.
పెండింగ్ ధరణి దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలి.
నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై జిల్లాస్థాయిలో వర్క్ షాప్ నిర్వహణ.
ఎల్ .ఆర్.ఎస్, భారీ వర్షాలు, ధరణి , ఆర్ఓఆర్ చట్టం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి
మెదక్ 20 ఆగస్టు 2024
రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి వనరుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎల్.ఆర్.ఎస్, భారీ వర్షాలు, ధరణి, ఆర్.ఓ.ఆర్. చట్టం పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తో కలిసి ఈ విడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్. కు సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. సిబ్బంది కొరత ఉన్నచోట అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన అదనపు సిబ్బందిని నియమించుకొని పనులు పూర్తిచేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పర్య షిప్ టించి వివరాలను సేకరించాలని, జిల్లాలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రకారం అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వారు వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేసేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సర్వే నెంబర్ల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం/మున్సిపాలిటీ లలో బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేస్తారని, అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, హెరిటేజ్ బిల్డింగ్, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలోవి కావని ధ్రువీకరించాలని అన్నారు.

ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ 3 నెలలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడ ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని, అదే విధంగా నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు పాల్పడవద్దని అధికారులకు సూచించారు.
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని కట్టుదిట్టంగా సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి సూచించారు.
ధరణి పోర్టల్ లో పెండింగ్ ఉన్న దరఖాస్తుల స్క్రుటిని పూర్తి చేసి పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు సదరు కారణాలు తెలియజేయాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లు ప్రతిపాదించిందని, దీని పై జిల్లా లలో ఆగస్టు 23, 24వ తేదీలలో వర్క్ షాప్ నిర్వహించి, ముసాయిదా బిల్లులో చేయాల్సిన మార్పులు, మెరుగైన సూచనలు ఏవైనా ఉంటే ఫీడ్ బ్యాక్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అందజేయాలని మంత్రి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మున్సిపల్ కమిషనర్, జానకిరామ్ సాగర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కాజా మొహినిద్దీన్, E.E పి ఆర్ నరసింహులు, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ సంబంధిత కలెక్టరేట్ ధరణి సెక్షన్స్ సూపరిండెంట్ , కలెక్టరేట్ ఏవో యూనస్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.