హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలసిన ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 30 ఆగస్టు 2024:
హైడ్రా కమిషనర్ ఏ.వీ రంగనాథ్ ఐ.పీ.ఎస్ ను మణికొండ ది సిటిజన్స్ కౌన్సిల్ ఆద్వర్యంలో ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ మొహమ్మద్, సంయుక్త కార్యదర్శి బి.ఉపేందర్ నాధ్ రెడ్డిలు కలసి మణికొండ కౌన్సిల్ అంతర్గతంగా ఉన్న నెక్నంపూర్ సర్వే నంబర్ 20 లోని ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇతర పబ్లిక్ వనరులు, సరస్సులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాల ఆక్రమణలపై సవివరముగా తెలియ పరుస్తూ తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తు ఇట్టి అరాచక కార్యకలాపాలను తక్షణమే ఆపాల్సిన అవసరాన్ని ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేయాగా, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సమస్యల తీవ్రతను గమనించి ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు, స్థలాల రక్షణ పరిరక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నామని తెలిపుతూ ప్రతిస్పందనగా మణికొండ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆక్రమణలను పరిష్కరించే కీలక బాధ్యతగా తొందరలోనే ఈ ప్రాంతాలను వ్యక్తిగతంగా సందర్శించి, సమగ్ర విచారణ జరిపి, ఉల్లంఘనలకు చేయూత నిచ్చిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అందుకు గాను వారి స్పందనకు కృతజ్ఞతలు తెలుపు కున్న ది సిటిజన్స్ కౌన్సిల్‌ సభ్యులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking