వేములవాడ ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిగారి ఆదేశాలు…!!

సనత్‌నగర్‌ ప్రజాబలం ప్రతినిధి హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకులు కలసి ఆశీర్వచనం అందించారు. ఈ సమావేశం ప్రభుత్వ విప్‌ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో వినోద్‌, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్‌, డీఈఈ రఘునందన్‌, ప్రధాన అర్చకులు ఉమేష్‌ శర్మ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల బడ్జెట్‌లో వేములవాడ ఆలయ విస్తరణకు రూ.50 కోట్లను కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ , ఆలయ అర్చకులు మరియు అధికారులు సీఎంను అభినందించారు.
ఆలయ విస్తరణకు సంబంధించి డిజైన్లు మరియు నమూనాలను శృంగేరి పీఠం నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలయ అర్చకులు వివరించారు. ఈ విషయాన్ని అంగీకరించిన సీఎం, వెంటనే శృంగేరి పీఠం నుండి అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశం ద్వారా వేములవాడ ఆలయ అభివృద్ధికి మరింత వేగం రానుందని, భక్తుల సౌకర్యాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking