-ఐసిఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ రాయబారపు హరికృష్ణ.
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జూన్21:శారీరక శ్రమ కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం భిన్నమైన రెట్టింపు అని ఐసిఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ రాయబారపు హరికృష్ణ అన్నారు. బుధవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఐసిఏఐ బ్రాంచ్ లో యోగా గురువు శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ హరికృష్ణ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిత్యం మానవ జీవన క్రమంలో ఉదయం నుండి రాత్రి వరకు శారీరక శ్రమ చేస్తున్న తరుణంలో మానసికంగా ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటాము.అలాంటి తరుణంలో మనసు ప్రశాంతతకు,మనసు నిలకడగా ఉండేందుకు ఒక స్థిరమైన కలిగింపజేసేది యోగా అని ఆయన అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన యోగాను పిల్లల నుండి వృద్ధుల వరకు ఎంతో ఆచరిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే యోగా చేయడం వలన పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ చైర్మన్ సీఏ.రాయబారపు హరికృష్ణ,కార్యదర్శి సీఏ సత్యనారాయణ పూజారి,వైస్ చైర్మన్ సీఏ భగవన్ దాస్ ముందడ,కోశాధికారి సీఏ మన్నెం రామకృష్ణ,స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ సీఏ మదరపు సుజిత్,సీఏ రాజు కొయ్యల,సీఏ చంచల్ అగర్వాల్,సీఏ వినీల్,సీఏ ఎన్. వంశీ కృష్ణ,సీఏ పర్మేష్,సీఏ తిరుపతి మరియు ఇతర సీఏలు,సీఏ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.