తెలంగాణా లో అన్ని స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోటీ
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్ట్ 22 ; : నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విలీనమైంది.ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణా లో అన్ని స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి, సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షులు మురళీధర్ దేశ్ పాండే తో కలిసి మాట్లాడారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షులు మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ త్వరలో ఇతర రాష్ట్రాలలో అన్ని శాఖలు విలీనం అవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ సీట్లులో సామాజిక న్యాయం జరగలేదని, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమకారులు ఉద్యమించారని, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక జనాభా కలిగిన బీసిలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని నియోజకవర్గ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శివశంకర్, వీరన్న, కోమటిరెడ్డి, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
Next Post