– ముఖ్యమంత్రికి ముదిరాజ్ మహాసభ విజ్ఞప్తి
బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్క నేతకు అవకాశం దక్కకపోవడం తీవ్ర విచారకరమని ముదిరాజ్ మహాసభ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడు అల్లుడు జగన్ లు మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయంపై సమాజంలోని ఇతర వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే పునః ఆలోచించుకొని తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కానిస్టేబుల్ కృష్ణయ్య నుంచి ఎంతోమంది ముదిరాజ్ యువకులు బి.ఆర్.ఎస్ పార్టీ అండగా ఉన్నారని అలాంటి సామాజిక వర్గం పట్ల వివక్ష ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 25 వరకు సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం తమకు ఉందని, 25న జరిగే క్లినరీలో తమ భవిష్యత్తు కార్యచరణ ను ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాధిక,ప్రభాకర్,రంజిత్, తదితరులు పాల్గొన్నారు