వేములవాడలో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), తేదీ 30-04-2025 బుధవారం రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ జనగణన తో పాటు, కుల గణన కూడా చేస్తామని తెలిపిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ పార్టీ పక్షాన వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ జనగణన చేస్తూ, కుల గణన కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని తెలియజేస్తూ, రాహుల్ గాంధీ కుల గణన అని బీరాలు పలుకుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీసీ కుల గణన మాత్రమే చేసి అందులోనూ మైనార్టీలను బీసీలుగా చేర్చడం చాలా దుర్మార్గకరమైన చర్యని దీని ద్వారా బీసీలకు ఎంతగానో అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేవలం బిజెపి పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్, మాజీ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, సీనియర్ నాయకులు రవి కిషోర్, కిషన్ రెడ్డి, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking