ఫిబ్రవరి 3 న చెన్నూరుకు మంద కృష్ణ మాదిగ
మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల ఇన్చార్జ్ కాశీపేట లింగయ్య
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 27:
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఫిబ్రవరి 7న జరిగే లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని మాదిగలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల ఇన్చార్జ్ కాసిపేట లింగయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 3 న చెన్నూరులో పర్యటించనున్నారని చెప్పారు. ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడుతున్న చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులోనే సమాయత్త సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెన్నూరులో జరిగే సన్నాహక సమావేశానికి మాదిగ బాంధవులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంతెన సంపత్, రేగుంట చంద్రశేఖర్, తుంగపిండి శంకర్, జీడి సారంగం, చిలుముల రాజ్ కుమార్, శనిగారపు కుమార్, కంబాల రాజనర్సు, దాసరి రాజనర్సు, విరుగురాళ్ల వెంకన్న, మంతెన సుమన్, వేల్పుల కిరణ్, మిట్టపల్లి బాబు, ములకల రాజేంద్రప్రసాద్, ములకల రమేష్, బచ్చలి భీమయ్య, గొల్లపల్లి ఓదెలు, సప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.