అందోల్ నియోజకవర్గం ప్రతినిధి (జూలై 24 ప్రజాబలం )సంగారెడ్డి జిల్లా :
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, నియోజకవర్గ పర్యటనలో చౌటకూర్ – జోగిపేట,మండలాలలో పర్యటనలో భాగంగా 24,7,2025,రోజు చౌటకూర్ మండల కేంద్రంలో ఉన్న హోటల్ లో, స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు, హోటల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు, హోటల్ లో తయారు చేస్తున్న, వంటకాలను పరిశీలించారు,

ఫుడ్ సేఫ్టీ,నిబంధనలు పాటించాలని హోటల్ నిర్వాహకులను కోరారు, చౌటకూర్, మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న, (కేజీబీవీ) స్కూల్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేశారు, అనంతరం సుల్తాన్పూర్ (జేఎన్టీయూ ) కాలేజీ ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు( జేఎన్టీయూ ) విద్యార్థులకు మంత్రి సహకారంతో, అందించిన 100,సైకిల్ ను పరిశీలించారు, ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ, సైకిల్ ను స్వయంగా నడిపి ఆనందం వ్యక్తం చేశారు, సుల్తాన్పూర్ (జేఎన్టీయూ) కాలేజీలో అధునాతన ఆడిటోరియం ను, 200, ఫీట్ల టవర్ ను, అత్యాధునిక సైన్స్ ల్యాబ్ లను నిర్మిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ, పర్యటనలో భాగంగా అందోల్- జోగిపేటలో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు, నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని, మంత్రి అధికారులకు సూచించారు, ఈ పర్యటనలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, వెంట ఆర్డీవో పాండు, మండల రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు…
