.హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన అటవీ & పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ!
గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లలో అమలు చేయలేని కనీస అవసరాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే.. జీర్ణించుకోలేని కేటీఆర్ ఇవాళ చిల్లర మాటలు.. చిల్లర విమర్శలు చేస్తున్నారు..
మా ప్రభుత్వం ఏర్పడి నేల కూడా కాలేదు.. కనీసం 100 రోజులు కూడా సమయం ఇవ్వకుండా అప్పుడే 100 రోజుల్లో ప్రభుత్వం పడిపోతది.. అంటే మళ్ళీ ఎలక్షన్ లు వస్తయా??? ప్రజలను ఎందుకు తప్పుతోవ పట్టిస్తున్నారు! నాకు అర్దం అయితలేదు..
కేటీఆర్ ఏమి మాట్లాడుతున్నాడో… కొంచం ఐన ఆలోచించి మాట్లాడితే బాగుంటది అని మంత్రి సురేఖ అన్నారు.
తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ప్రజల సొమ్ముని పందికొక్కుల్ల మేసి అడ్డంగా బలిసి.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు ను కోల్పోయారు.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని.. , ఉద్యమకారులను అన్యాయంగా బయటకు పంపింది ఎవరు
మహిళలపై దాడులు జరిగినప్పుడు గానీ, కొండ గట్టు మీద జరిగిన ఘోర ప్రమాదం లో 63 మంది చనిపోతే స్పందించని లీడర్లు ఇప్పుడు ప్రజల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు..
ఇప్పుడు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం.. సిగ్గుచేటు అని సురేఖ అన్నారు..
వరంగల్ లో సెంట్రల్ జైల్ ను కూల్చి.. హాస్పిటల్ కట్టడం ఎందుకు? హాస్పిటల్ మంచి వాతావరణం లో కడితే బాగుంటది అని చెప్తే.. దానిని తప్పుగా ప్రచారం చేస్తున్న వారికి కొంచం ఐన ఇంకిత జ్ఞానం వుండాలి.. హాస్పిటల్ ఎప్పుడు మంచి వాతావరణం లో ప్రశాంతంగా వుండాలి.. అప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారు..
దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.. తెలం lగాణకు దళితుడిని తొలి ముఖ్య మంత్రి చేస్తామని
చేసిందెవరు..? రైతుల రుణమాఫీ ఇస్తామని ఎగ్గొట్టింది ఎవరు..? తొమ్మిదిన్నరేం డ్ల పాలనలో తెలంగాణ లో విధ్వంసం జరిగింది. బీఆర్ఎస్ అహంకారం తో పరిపాలన అస్తవ్యస్తమైంది.
అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇచ్చిన అభయహస్తం గ్యా రం టీ హామీల ప్రకారం ఆర్టీసీలో
ఉచితం గా మహిళలకు బస్సు ప్రయాణం అమలు చేసిం ది కాం గ్రెస్ ప్రభుత్వం..
మీ కుటుంబం లోని
మహిళలనో, మీ పార్టీ మహిళా లీడర్లనో ఒక్క సారి ఆర్టీసీ బస్సు లో ఒక్కసారి ప్రయాణం చేయమని చెప్పండి.. మేం ఇచ్చిన హామీ అమలవుతుందో లేదో తెలుస్తుంది…
ప్రజలను లైన్లలో నిలబెట్టి.. ప్రతి రోజు ప్రజలను గోస పెడుతున్నమని కేటీఆర్ మాట్లాడటం అహం కారానికి నిదర్శనం.. గడీ,ఫామ్ హౌజ్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్కు ఇప్పు డు ప్రజల బాధలు కనిపిస్తున్నాయా..?
ఆందోళనలు,ధర్నాలన్నింటిపై నిర్బంధం , ధర్నా చౌక్ను ఎత్తేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ కు దక్కుతుంది. ప్రగతిభవన్ ఇనుప బారికేడ్లు
తొలగించి.. ప్రజలు తమ సమస్య లు చెప్పుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజా వాణిని విమర్శిం చటం.. వాళ్లకున్న అహంకారాన్ని చాటిచెపుతోంది.
ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం గా ఉంది.
ఇంతకాలం దాచిపెట్టిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి…
మీరు కట్టిన మేడిగడ్డ ఎలా కుంగిపోయింది?
బాధ్యులెవరు??
కాళేశ్వరం పై న్యాయ విచారణ అనగానే.. కేసీఆర్ కేటీఆర్ కు వణుకు మొదలైంది…
ఎవరెవరి వాటా ఎంత? ప్రజాధనం ఎంత దుర్వినియోగమైందో..
అదంతా కక్కించేందుకు కాంగ్రెస్
ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఎన్నికల ప్రచారం లో బీజేపీని ఎక్క డన్నా కేసీఆర్ విమర్శించిండా… !
మోడీని పల్లెత్తు మాట అనలేదు ఎందుకు భయపడ్డాడు..?
లిక్కర్ స్కామ్ ఎటు పోయింది..? ఎవరు ఎవరితో అంట కాగారు..?
గోషామహల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు..
బంజారాహిల్స్ లో ఎందుకు పోటీ చేసింది..?
కేటీఆర్ కు సూటిగా అడుగుతున్న… ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ 22 కొనుగోలు చేసింది నిజం కదా ? విజయవాడలో పెట్టింది నిజం
కాదా? వీవీఐపీల భద్రతకు వాహనాలను కొనుగోలు చేయాలని కేబినేట్ మీటింగ్ లో నిర్ణయం
తీసుకుంటే.. అప్పుడే ఎందుకు ప్రజలకు వెల్లడించలేదు..?
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు
డబ్బుల్లేకుండా అప్పులు చేసిన మీ ప్రభుత్వం.. అంత ఖరీదుతో అన్ని వాహనాలను ఎందుకు కొనుగోలు
చేసింది ప్రజలు చెప్పాలి కదా!
శ్వేతపత్రాలతో ఎవరు భయపడుతున్నారు… ?
తెలంగాణను అప్పులపాలు చేసింది ఎవరు.? కాంగ్రెస్ వస్తే పరిశ్రమలు పోతాయి… కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది.. అని మీరు చేసిన విష ప్రచారం ప్రజలు ఇంకా మరిచిపోలేదు…?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే
అమలవుతున్న ప్రజాహిత సుపరిపాలన మీకు మింగుడుపడటం లేదు… అందుకే ఓర్వ లేక అహంకారపు
విషం చిమ్ముతున్నారు అని మంత్రి కొండ సురేఖ తన నివాసంలో మాట్లాడినారు..